Latest Posts

Content

Thursday, April 20, 2017

నాలోని నేను

అరచెయ్యంతా పండిన గోరింటాకు చూస్తే అరిచెయ్యాలన్నంత ఆనందంగా వుంది!

ఆ గాజుల గలగలలు వింటోంటే గుండెల్ని 
మల్లెపూల బుట్టలో దొర్లిస్తున్నట్టుంది!

అబ్బ! ఆ చిన్ని నోరుచూడు! శ్రీకారంచుట్టినట్టు! బాపూగారు బొమ్మలన్నీ ఈమెని చూసే వేసుంటారు!

...........ఇదంతా నేను!

ఇలా గోరింటాకులూ, గోంగూరలూ పెట్టుకుని ఆపరేషన్లకొస్తే ఎలామ్మా? వేలికి పెట్టే మిషన్లు పనిచెయ్యవిక్కడ!

ఇన్ని గాజులా? సీమంతం మీ ఇంట్లోవాళ్ళే చేశారా ఊరందరూ కలిసి చేశారా? గాజులుంటే బాటిల్లో సెలైన్ ఎక్కదమ్మాయ్! తీసెయ్యాల్సిందే!

అబ్బే! నోరసలు తెరుచుకోవట్లేదు మేడమ్! అంత చిన్న నోరుంటే ఎనస్తీషియాలో కష్టం! ట్యూబ్ వెళ్ళాలా గొంతులోకి? ఇట్సే హైరిస్క్ కేస్! చెప్పండి వాళ్ళవాళ్ళకి!

........ఇది నాలోని ఎనస్తటిస్టు!

మొదటిది మనసు నింపుతుంది!
ఇక రెండోది కడుపు నింపుతుంది!!

బతుకు జట్కాబండి....ఇలానే లాగిస్తున్నాను!😢 

                           .........జగదీష్ కొచ్చెర్లకోట 

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive