“నీళ్ళుకాగాయో లేదో చూడు..."
“చిన్నాణ్ణి లేపు, బడికి లేటవుతోంది..."
“నాన్నకి కాఫీ ఇచ్చిరా!..."
“త్వరగారా! రెండల్లులు అల్లేస్తాను! రాత్రన్నం వుంది, మీరిద్దరూ తినేసి బయల్దేరండి!"
“చిన్నాణ్ణి లేపు, బడికి లేటవుతోంది..."
“నాన్నకి కాఫీ ఇచ్చిరా!..."
“త్వరగారా! రెండల్లులు అల్లేస్తాను! రాత్రన్నం వుంది, మీరిద్దరూ తినేసి బయల్దేరండి!"
చిన్నాడి అలకలు, చిన్నారికి అల్లికలు, పనమ్మాయికి అంట్లు, పతిదేవుడికి అట్లు....
స్టాక్‌మార్కెట్ కన్నా సందడైన వాతావరణం!
.......అందమైన కలల అరుణోదయ సమయం
కాలింగ్‌బెల్‌తో కలుషితమయ్యే నిశ్శబ్దంతో మొదలవుతుంది
సుబ్బలక్ష్మి సుప్రభాతంతో సుస్వరాలజల్లౌతుంది
గుమ్మంలో కుందేళ్ళలా కూర్చున్న పాలపేకెట్లని చూస్తే అవి మీకు వంటింట్లోకి తోడొచ్చినట్లనిపిస్తుంది
పొయ్యిమీద పొంగుతున్న పాలమీద నీళ్ళుచల్లేస్తే పెళ్ళికిముందుండే మీ ఉత్సాహం గుర్తొస్తుంది
కాఫీ చప్పగా వుందన్నప్పుడు మీకు చప్పున మీజీవితం జ్ఞాపకమొస్తుంది
వెయిట్‌ని తన్నుకొచ్చే ప్రెషర్ కుక్కర్‌ని చూస్తే ‘నాకన్నా ఇదే నయం!' అనిపిస్తుంది
అందరూ వెళిపోయాకా అసలుకథ మొదలౌతుంది
రికామీగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ
రికార్డులకెక్కని పనప్పుడే మొదలౌతుంది
రికార్డులకెక్కని పనప్పుడే మొదలౌతుంది
వర్షించని మేఘంలా వృథాగా కనిపిస్తుంది
హర్షించని మీశ్రమ అడవికాచిన వెన్నెలౌతుంది
హర్షించని మీశ్రమ అడవికాచిన వెన్నెలౌతుంది
పులుసు బాగోపోతే ఆయన తిట్టేస్తాడేమో...
గొలుసు బావుంటే గుడిదగ్గర కొట్టేస్తారేమో...
గొలుసు బావుంటే గుడిదగ్గర కొట్టేస్తారేమో...
అన్నీ భయాలే!
కానీ....
కల్పన గురించి చదివితే అభూతకల్పన కాదనిపిస్తుంది
నిర్భయతో వచ్చిన భయం నీరజతో పోతుంది
యద్దనపూడిచ్చిన పొగరు
యండమూరిచ్చిన ఆత్మవిశ్వాసం
యముణ్ణే ఎదిరించిన సావిత్రి మనోధైర్యం....
తలుచుకుంటే యధేచ్చగా ఎగరాలనిపిస్తుంది
యండమూరిచ్చిన ఆత్మవిశ్వాసం
యముణ్ణే ఎదిరించిన సావిత్రి మనోధైర్యం....
తలుచుకుంటే యధేచ్చగా ఎగరాలనిపిస్తుంది
మదర్ థెరిసాలు, సిస్టర్ నివేదితలు అంతా మనవాళ్ళేకదా అనిపిస్తుంది
మీసేవాతత్పరతకు గీసిన గీతని చెరిపేసుకోవాలనిపిస్తుంది
మరో జన్మకైనా మహిళగానే పుట్టాలనిపిస్తుంది.
**********శుభాకాంక్షలు***********
..........జగదీష్ కొచ్చెర్లకోట
tadhastu tappakunda puttandi
ReplyDelete