అలారం మోగిందన్న ఆనందం
పేపర్‌బోయ్ నీళ్ళు చూసుకోకుండా విసిరేసాడన్న కోపం
బీటెక్ చదివే పిల్ల ఏడైనా లేవలేదన్న బాధ
పనమ్మాయి పెందరాళే వచ్చేసిందన్న సంతోషం
ఆయనకోసం చెట్నీ చేద్దామంటే కరెంటులేదన్న కంగారు
వాటర్‌బాటిల్సన్నీ నేనే నింపాలన్న విరక్తి
టీవీలో 'మధువొలకబోసే..' పాటొస్తోంటే చూడలేకపోతున్నానన్న దిగులు
రాత్రి ఆయన చెప్పిన కబుర్లు తలుచుకుని నవ్వు
ఎదురింటావిడ కనబడినా నవ్వలేదని తనూ నవ్వని బెట్టు
పెద్దక్కకి ఫోన్‌చేసి వారంపైనే అయ్యిందన్న లెక్కలు
షర్ట్ ఐరన్ చేసినందుకు కొడుకు థాంక్స్ చెప్పాడన్న మురిపెం
మాఁవగారు కాఫీ బావుందన్నారని గర్వం.....
ఇత్యాది భావోద్వేగాల మధ్య ఓ మహిళా... శుభోదయం!
ఇక మొదలెడదామా??😜
0 comments:
Post a Comment