Latest Posts

Content

Saturday, October 15, 2016

ఏమి వెన్నెల ?


"ఏమి వెన్నెల ఎంతకూ మన ఇద్దరిపైనే పడుతున్నది...తనకు దాహం వేసిందేమో మనలనల్లరి పెడుతున్నది..."
నారాయణరెడ్డిగారి పదవిన్యాసం, చక్రవర్తిగారి స్వరలాస్యం, సుశీలమ్మ గళమాధుర్యం, బాలుడి గాత్రకదనం...!
చంద్రుడికి కూడా రాని కొత్తకొత్త ఆలోచనలు రప్పించే పాటయిది!
ఆయన సంగతేమోగానీ బోస్ స్పీకర్లో ఈపాట మాత్రం చాలా అల్లరి పెడుతోంది.
ఆ అల్లరి అయిపోగానే ఫోనొచ్చింది. "ఎమర్జెన్సీ కేసండీ...వస్తారా?" అంటూ!
మనసైన గీతం పంచే మధురమైన తలపులొకవైపు
మత్తువైద్యం నాకందించే కర్తవ్యపు పిలుపులొకవైపు

తప్పనికాదుగానీ...తప్పనిసరికదా అని!😜
స్విఫ్ట్ కార్...
సిక్స్టీ స్పీడ్...
సింగిల్ హేండ్ డ్రైవింగ్...
స్టీరియోలో సోలోసాంగ్స్...

....రోడ్డంతా పరచుకున్న వెన్నెల శివాలెత్తిస్తోంది!
ఇప్పుడీయన మొదలెట్టాడు అల్లరిపెట్టడం!

ప్రతీపౌర్ణమీ కొత్తగా కనిపిస్తుందేం?
ప్రతిక్షణం అమ్మ నవ్వులా..
ప్రతిపూటా పూసే పువ్వులా..
ప్రతియింటా పాపాయి ఆటలా..
ప్రతిరోజూ తినే ఆవకాయ ఊటలా..

ప్రతివెన్నెలా ప్రత్యేకంగా కనిపిస్తుంది!
ప్రత్యక్షదేవుని పరవశంతో చూడాలనిపిస్తుంది!

"నాతోడువై...
నానీడవై...
నాఆలన..నాపాలన..
నాజీవనజీవం నీవై.."

ఈపాట సందర్భానికి మరింత అందంగా అమరింది!
ఆశ్వయుజ మాస పౌర్ణమి శుభాకాంక్షలు!
నేనలాగే చెబుతాను. ప్రతి పౌర్ణమీ నాకు పండగే!
........జగదీష్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive