Latest Posts

Content

Thursday, May 11, 2017

సర్వేపల్లి

ఇంట్లో వంటచెరకు కోసం శిష్యబృందాన్ని సమిధలేరుకురమ్మన్న గురువుల గురించి విన్నాం. 

దేశక్షేమం కోసం సమిధలుగా మారిన శిష్యుల్ని తయారుచేసిన గురువులగురించీ విన్నాం.

ఆరుబయట బడినుంచి ఆన్‌లైన్ పాఠాలదాకా
పలకాబలపాలనుంచి పవర్‌పాయింట్లదాకా 
పేకబెత్తాల దగ్గర్నుంచి లేజర్ స్టిక్కులదాకా
పొడుంకాయలనుంచి పోడియంల దాకా
ప్రగతిమార్గంలో ఎదిగిన పథనిర్దేశకులు మీరు.

స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న అధ్యాపకులున్నారు
స్వాతంత్ర్యదినోత్సవానికైనా రాని ఉపాధ్యాయులూ వున్నారు.

చరిత్ర పాఠాలు బోధించడమే కాదు
చరిత్రను సృష్టించినవారూ వున్నారు 

లెక్కలు చెప్పే మాస్టర్ల గురించి మాకు తెలుసు
మాస్టర్లను లెక్కచెయ్యని స్టూడెంట్లూ తెలుసు

విద్య నేర్పించినా విజ్ఞానం బోధించినా
వినయ విధేయతలేదే విశిష్ట స్థానం

స్నేహభావం పెంచుకోండి
స్నేహితుల్లా మారకండి

నిరంతరం అందుబాటులో వున్నా
అంతరాన్ని మాత్రం పాటించండి

కళాశాల ఉత్సవాలలో కలిసి నర్తించడం కన్నా
కళ్ళెదుట ర్యాగింగ్ కర్కశుల్ని గుర్తించడం మిన్న

బ్రతకలేక బడిపంతులు కాదు
బడిపంతుల్లేక బ్రతుకు లేదు!

సర్వేజనా సుఖినోభవంతు
సర్వేపల్లిగా మారడం మీవంతు!


శుభాకాంక్షలు!

                       ................జగదీష్ కొచ్చెర్లకోట 






0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive