Latest Posts

Content

Thursday, May 11, 2017

శివోహం....శివోహం....

శివుడంతటి నిస్వార్ధ, నిరాడంబర, నిర్వికార, నిరుపమాన దైవం మరెవరూ లేరనిపిస్తుంది. ఆయన దేవుడో కాడో పక్కనబెడితే ఐక్యూ కన్నా ఈక్యూ ఎక్కువున్న మహానుభావుడు మన శివుడు....ఏమంటారు?

ఏ సందర్భంలోనూ అతితెలివిగానీ, కుట్రగానీ, లౌక్యంగానీ ప్రదర్శించని వ్య(శ)క్తిత్వం ఈ రుద్రునిది.

ఈకాలపు కార్పొరేట్ కల్చర్ లో నిత్యం వినబడే మాట....స్థితప్రజ్ఞత....అంటే నవ్వొచ్చినా నవ్వాలి....ఏడుపొచ్చినా నవ్వాలి...

"నీకింద వందమంది పనిచేస్తారు. నీకు మోషనొచ్చినా ఎమోషనొచ్చినా ఎదుటివారికి తెలియకూడదు. తియ్యాలనుకున్న గోతులు గునపానిక్కూడా తెలీకుండా తియ్యాలి." ఇదీ ఐక్యూ(ఇంటెలిజెన్స్ కోషెన్స్) అంటే. 

విపరీతమైన ఆనందం కలిగితే తాండవశివుడు...కోపమొస్తే ప్రళయరుద్రుడు. నవ్వొస్తే నవ్వాలి, ఏడుపొస్తే ఏడవాలి..అనే వేదాంతం కనబడ్డంలా ఇందులో? ఇదీ ఈక్యూ(ఎమోషనల్ కోషెన్స్) అంటే.

తనకెంత ప్రమాదమో కూడా ఆలోచించకుండా గరళాన్ని మింగి మన జీవితాల్ని సరళం చేశాడు.
కమిట్‌మెంట్ కి మరో పదం వీరి వరదానగుణం. మాటతో పాటు హేండు కూడా ఇచ్చేవారందరూ ఈ కథలు చదవాలి. మాటకి కట్టుబడడమంటే ఏఁవిటో తెలుస్తుంది.

మనకున్నదాంతోనే గుర్తింపు వొస్తుంది. పైనుంచి సోకయిపోతున్న బిల్డింగ్ లకి రంగులేసి సోకు చేసినట్టు....మనలో మేటర్ లేకపోతే ఎంత మేకప్పేసినా వృథానే! 

ఈయన బూడిదపూసుకున్నా, నాగుల్నే నగలనుకున్నా, చర్మాలు చుట్టుకున్నా....ఈయనే ఆదిదేవుడు. 

ఆ నిరాడంబరతే అంబరాన్నితాకే నిదర్శనం.
ఆ నిస్వార్ధతత్వమే మన జీవితానికి పరమార్థం.

శివోహం....శివోహం....శివోహం.

     
            .................జగదీష్ కొచ్చెర్లకోట.

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive