‘బయల్దేరుతున్నా బన్నీ!' నిలబడి షూస్ వేసుకోడానికి డాన్స్ చేస్తూ లోపలికి కేకపెట్టాను.‘బాక్స్ పెట్టుకున్నావా?' వంటింటి వైపు బాల్కనీలోంచి వస్తూ అడిగింది. వంటిల్లన్నానని తనేదో పొద్దున్నే వంటలవీ చేసేస్తోందని ఓ.. జాలి పడిపోకండి. వంటమనిషుంది. ఆవిడకి ఎలా వండాలో కాకుండా ఎలా వండకూడదో చెప్తే చాలు. రుచి దానంతటదే వస్తుంది.‘ఆఁ, పెట్టుకున్నా! ఏం పెట్టావు బాక్స్‌లో?’ అన్నాను లిఫ్ట్ బటన్ నొక్కుతూ.‘నిన్న సాయంత్రం వలచీనానమ్మా పాట పాడుతూ...
Welcome to Dr. Jagadeesh
Latest Posts
Content
వినాయకచవితి
‘వినాయకచవితికి కొత్తబట్టలు ఎవరూ కొనుక్కోరు. నెలతిరగ్గానే దసరా వస్తుందిగా? అప్పుడెలాగూ కుట్టించుకోవాలి. ఉన్నవాటిలో కాస్త మంచివి తీసి వేసుకోండి! చాలు’ఇక చేసేదేంలేదు. అమ్మ మానిఫెస్టోలో లేనివి అడగడం అనవసరం. ముదురు రంగు నిక్కర్ల మీదకి ఏ చొక్కా వేసుకున్నా బానేవుంటుంది. నలుగుర్లోనూ కాస్త ఆనతారు పిల్లలు. ఇవన్నీ అనుభవం నేర్పిన పాఠాలు. గళ్ళ బుష్కోట్లకీ, చారల చొక్కాలకీ కావలసిన తాను నాన్నగారు ఆప్కోలో కొనేవారు. గుడ్డ కాస్త మందంగా ఉండటాన...
దసరా మామూళ్ళు
మా హాస్పిటల్లో దసరాలకి పదిరోజుల ముందునుంచి విపరీతంగా సెల్యూట్లు కొట్టడం మొదలెడతారు మా గార్డులు, ఇతర సిబ్బందీ. అందరికీ సమాధానం ఇవ్వలేక మెడనొప్పి కూడా వస్తుంది ఖర్మ. ఆ సాయంత్రానికల్లా ఓ అరడజనుమంది కలిసి రవ్వా అప్పలనరశింహులు & సన్సు వారి తొంభయ్యారు పేజీల రూళ్ల నోట్‌బుక్ ఒకటి పట్టుకునొస్తారు. అందులో పైన శ్రీరామ అని, కింద నా పేరుకెదురుగా ‘రూ|| 2,000/-’ అని రాసుంటుంది. నాపేరుకి పైన ఇంకో గైనికమ్మగారిచ్చిన అయిదొందల్ని...
వర్షాతిరేకం
అంబరాన మబ్బుల్ని చూస్తే సంబరంగా అనిపించాలేగానీఅంబరెల్లాల్ని వెతుక్కోకూడదుమబ్బుల అంచుల్ని ముద్దాడేకొబ్బరాకుల చిలిపి గిచ్చుళ్లతోనిబ్బరంగా ఉన్న మేఘాలన్నీఇబ్బడిముబ్బడిగా వర్షిస్తాయిగుమ్మం దాటనివ్వని వర్షంలోఅమ్మ చేతిలో అరటికాయలన్నీ కమ్మనైన సెనగపిండితో కలిసినెమ్మదిగా బజ్జీలైపోతుంటాయిఆరుబయట సత్తుగిన్నెలన్నీనోరుతెరుచుకు చూస్తూ ఉంటేచూరునించి జారే చుక్కలన్నీతీరని దాహం తీరుస్తాయికాయితాలన్నీ కత్తిపడవలుగాకరెంటులేని కష్టాలు కాస్తాకల్మషమెరుగని...
జగమే రామమయం
మేఘాలన్నీ నీ రంగు పులుముకున్నాయి. దారిపొడవునా చెట్లన్నీ పూలను నింపుకుని పులకింతల్లో తేలుతున్నాయి. ఆనందంతో ఊగిన ప్రతిసారీ జలజలా పూలు రాలుస్తున్నాయి. తారురోడ్డంతా జలతారులా మెత్తగా... బ్రతుకు పూలబాట కాదన్నాడు కవి. మరి ఇదేవిఁటోయి రామా?అల్లంతదూరాన ఆలయశిఖరం బడినుంచి వచ్చే పిల్లాడికోసం ఎదురుచూసే అమ్మలా కనబడుతోంది. ఆత్రంగా ముఖద్వారాన్ని చేరాం. పండుముదుసలి రావిచెట్టొకటి ఒక కొమ్మతో ఆకుల్ని పైకెత్తుకుని ‘ఎవరదీ?’ అంటూ పలకరించింది.... అచ్చం...
సూపర్నెంటు
‘సార్, నాలుగైపోయింది బయల్దేరరా?’ గదిలోకొచ్చి నే తాగిన టీకప్పు తీసుకెళుతూ అన్నాడు రాంబాబు.‘ఇదిగో, బయల్దేరుతున్నా! ఏదో మెయిలొస్తే చూస్తున్నా!’ అంటూ టాబ్ క్లోజ్ చేసేసి మొబైల్లో ఫేస్ అటెండెన్స్ తెరిచాను. ఉదయంపు పంచు, మధ్యాహ్నపు పంచు, సాయంత్రపు పంచు... అంటూ ముప్పొద్దులా మా ముఖసౌందర్యాన్ని తప్పనిసరిగా చూపించాలి ఈ యాప్‌వాడికి.ఆ క్రతువు పూర్తిచేసుకుని సూట్‌కేస్ పట్టుకుని బయటికొచ్చాను. నా క్యారియర్ బ్యాగ్ తను పట్టుకుని బయటికొచ్చి తాళం...
మావూరు అనకాపల్లి
ఊరనగా ఎంతా, ఆమూల గాంధీనగరంలో నడవటం మొదలెడితే సత్యనారాయణ థియేటర్ చేరేసరికి ఇరవైనిముషాలు పట్టేది. ఇప్పట్లా బరువనీ, పరువనీ ఇబ్బందులు లేని వయసాయె. నేను ఎనిమిదీ తొమ్మిదీ తరగతుల్లో ఉండగా ఊరికి నడిమధ్యలో ఉండే నరసింగరావుపేటనించి బ్రాహ్మలెక్కువగా ఉండే గాంధీనగరానికి మకాం మార్చారు నాన్నగారు. ఆ ఇంటి గురించి ఇదివరకు చెప్పుకున్నాం, ఇంటిముందు పున్నాగపూల చెట్టూ, ఇంటి పంపరపనస చెట్టూ ఉండేవని. నాకైతే ఆ ఇంటితో చాలా జ్ఞాపకాలున్నాయి....
మెడికోలాహలం
‘ఎప్పుడూ చదువేనా?’ అనిపించి కాసేపలా బయటపడి సాయంకాలాల్లో సాగరకన్యతో సరసాలాడ్డానికి హాస్టల్ గదులు తెరుచుకునేవి. ఇద్దరుంటే మూడోవాడిని అవాయిడ్ చేసే ‘బాయిడ్’గాళ్లు చెప్పాపెట్టకుండా చెట్టపట్టాలేసుకుని జిల్లాపరిషత్ బజ్జీల బండి దగ్గరకెళిపోయేవారు. అట్నించి రాగానే వాళ్లిద్దరూ మాయాబజార్లో శర్మా శాస్త్రుల్లా వంకాయ బజ్జీ రుచిని వర్ణిస్తోంటే మాకు నోట్లోంచీ, కళ్లలోంచీ నీళ్లు కారిపోయేవి. నన్ను తీసుకెళ్లకుండా పోయిన ఆ ‘కన్నింగ్’హామ్‌గాళ్ల...
జోలపాట
‘అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా...ఓసీ వేలెడేసిలేవు బోసినవ్వులదానా...!’తన్మయత్వాన్ని గొంతులో పలికిస్తూ సుతారంగా ఊయలూపుతోంది కావేరి. మూడునెలల ముద్దబంతి పిల్ల మిణుగురు కళ్లేసుకుని పాలుతాగిన ఇంటి ఫాల్స్ సీలింగుని చూస్తోంది. దానికి నిద్రరావడంలా! ఊరికే గుణుస్తోంది. లేకపోతే అమ్మ పాట పాడదుగా?తియ్యని స్వరాలు నిశ్శబ్ద మందిరంలాంటి ఆ గదిగోడల్ని తాకుతున్నాయి. లేతరంగుల్ని సంతరించుకున్న ఆ ఇల్లంతా కనులకి చల్లగా ఉంది. కావేరిది మధురమైన...
నా బండికథ
‘నాకైతే రాయల్ ఎన్‌ఫీల్డే కొనుక్కోవాలనుంది. నా యవ్వనమంతా సిటీబస్సులు, స్కూటీ పెప్పులతో గడిచిపోయింది. ఇప్పటికైనా బుల్లెట్ మీద అమ్మనెక్కించుకుని అలా ఆచ్చెళ్లాలని అనిపించకూడదా? ‘ఎంతసేపూ ఫేస్‌బుక్‌లో లైకులే తప్ప బైకుల గురించి ఏ ఆలోచనా రాదా నీకూ?’ అని పోరుపెడుతోంది మీ అమ్మ ఎప్పట్నుంచో!’ఆపై ఇక మాటరాక గొంతు గద్గదమై ఆగిపోయాను. కొడుకులిద్దరూ ఏదో చర్చలో పడ్డారు. బయటికి వినబడకుండా గొణుక్కోవడం తెలుస్తోంది. మధ్యలో ‘ఓవరేక్షన్’ అన్న మాటేదో గుసగుసగా...
వడియం
‘ఇవాళ సాంబారు పెడుతున్నావా లేక ముక్కలపులుసా?’ వంటింట్లోకొచ్చి అడిగాడు కామేశ్వర్రావు. పార్వతి స్టవ్ మీద చామదుంపలు వేపుతోంది. ‘సాంబారు కోసమే ముక్కలన్నీ తరిగుంచమన్నాను రాజ్యాన్ని. పన్నెండింటికల్లా అన్నం పెట్టేస్తాను. కాసేపలా టీవీ చూడండి!’ అంది భర్తని వంటింట్లోంచి ఎలాగైనా పంపించెయ్యాలని.చెక్కబీరువా తలుపులు తెరిచి పాత బోర్నవిటా సీసాలోంచి నిమ్మబద్దొకటి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆ పులుపుకి కన్నొకటి మూసేస్తూ ‘సాంబారంటున్నావు...
రోజూ ఇంతే
‘ఏండీ, టిపిన్ రెడీ అయిందా? అప్పుడే ఎమ్దింపావూ!’ స్నానంచేసి బయటికొచ్చి వంటింట్లో ఉన్న వంటావిడకి వినబడేలా అరిచాను.‘నువ్వెళ్లి బట్టలేసుకుని రా! ఈలోగా రెడీ చేస్తారు! అరగంటదాకా అవ్వదుగా నీ మేకప్పు?’ అంది సోఫాలో కూర్చుని రామకోటి రాసుకుంటున్న మా ఆవిడ. పాత సినిమాల్లో ప్లీడరు గుమాస్తాలా జారిపోయే కళ్లజోడులోంచి పైకిచూస్తూ నవ్వొకటీ!అమ్మనీ.. ఎంతమాటనేసింది! లాభంలేదు. కాస్త క్లుప్తంగా ముగించి, ఇవాళ ఎలాగైనా ఇరవైతొమ్మిది నిమిషాలకే బయటపడిపోవాలి....
పూర్ణా హాలు
‘ప్లీజ్‌రా, ఒక్కణ్ణీ వెళ్లడానికి మనసొప్పడంలేదు. రావచ్చుగా? తొమ్మిది పాటల్రా! అన్నీ సూపర్‌హిట్టే! వాణిశ్రీని చూడాలంటే బ్లాకండ్ వైట్ సినిమాల్లోనే చూడాలి. రారా! అప్పుడే పావుతక్కువ తొమ్మిదైపోయింది...’ఇహ వీడు వదలడు. పూర్ణాలో ఆత్మీయులు సినిమా ఆడుతోందని ఏవిఎన్ బస్టాప్ దగ్గర పోస్టర్ చూసి తెలుసుకున్నాడు మావాడు.అదేం విడ్డూరమో ఆ సినిమా ఎప్పుడొచ్చినా కొత్తగా మళ్ళీ పోస్టర్లు ప్రింట్ చేసేవారనుకుంటా, నాగేశ్వరరావు, వాణిశ్రీ అందంగా రంగుల్లో నవయవ్వనంతో...
బుల్లి సైనికుడు
‘సార్, ఈడికి నిన్నటికాణ్ణించి జొరం తగ్గిందంట! ఆళ్ల నాన్న చెప్మన్నాడు!’ ఓ చంటాణ్ణి ఎత్తుకుని లోపలికొచ్చాడు శీనుగాడు.‘తగ్గడం సంగతి సరే, అసలు ఎప్పట్నించి జ్వరమో అడిగావా?’ అని అడుగుతున్నానోలేదో‘మూర్రోలు కాణ్ణించి!’ అంటూ మూడువేళ్లు చూపించాడు ఐదేళ్ల ఆ చిన్నకుర్రాడు.మా అందరికీ భలే నవ్వొచ్చింది.పైన నీలంగళ్ల ఎర్రచొక్కా తొడిగారు. అడుగునేం లేదు. విప్పేసి తీసుకొచ్చారు. హైడ్రొసిల్ ఆపరేషన్ చెయ్యాలి వాడికి.టేబుల్ మీద కూర్చుని పైన లైట్లనీ, బాయిల్...
ఇష్టమైన ప్రయాణం
‘ఉండిపోడం కుదరదా?’‘ఇప్పటికే అటెండెన్స్ తక్కువైందని తిడుతున్నారు మా ప్రొఫెసర్. పరీక్షకి కూర్చోనివ్వనంటూ బెదిరించారు కూడా!’‘చదువు పూర్తవ్వకుండా పెళ్లిచేసుకోమని ఎవడు చెప్పాడు? సరే, బయల్దేరు. జాగర్త. బస్సులో శుభ్రంగా నిద్రపో. ఊరికే నాగురించి ఆలోచిస్తూ కూర్చోక!’‘అలాగే మేడమ్! అయ్యాయా, ఇంకా ఏమన్నా ఉన్నాయా చెప్పాల్సినవి?'‘టేప్ రికార్డర్ కావాలన్నావు? తీసివ్వనా?’‘అవునవును, మర్చేపోయాను. కేసెట్లున్నాయి మావాడి దగ్గర. తీసుకురా!’‘నీ పాటలపిచ్చితో...
Featured Post
అందాల నెలరాజు
నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search
Popular Posts
-
ఆరింటికి "ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.." అనగానే లేచి కూచునేవాళ్ళం. గబగబా దంతధావనం కానిచ్చేసి కాసిన్ని పాలు తాగేసి హోమ్ వర్కేఁవైనా ...
-
ఎంత బెంగనిపిస్తుంది ? నీగది రేపట్నుంచి నీదికాదు. అక్కడికి తాతగారి సామాన్లవీ వచ్చి చేరతాయి. ప్రయాణం ఖరారైన తరవాత నీపుస్తకాల గూడొకసారి ...
-
"డ్రెస్ బావుందా?" రెండుచేతులూ అటూయిటూ దూరంగాపెట్టి ఒక కాలు కొంచెం వంచి క్రీగంట చూస్తూ గోముగా అడిగింది కోమలి. "కొత్తదా?" ...
-
ఒద్దికగా ఒడిదుడుకుల్లేకుండా సాగిపోతోంది కారు. మారుతీ కంపెనీ సాంకేతికతో, మునిసిపాలిటీ వారి నియమబద్ధతో...రోడ్డు మాత్రం సతీ సుమతి చెల్లెల్లా...
-
#ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైన నా రచన.... ‘ఏఁవైంది సారూ? పన్ను నొప్పా?’ దవడ మూసుకుని, తలొంచుకు నడుస్తున్న రాజుని ఆపి అడిగాడు వాచ్ మన్ సూ...
-
క్యూ కాంప్లెక్స్‌లో నిలబడిన ప్రతిసారీ మనక్కనబడే హాథీరాంజీ మఠం చూసి ఓ దణ్ణం పెట్టడఁవే తప్ప ఆయనగురించి కాస్త పరిశోధిద్దామని ఏనాడూ అనుక...
-
బ్రాహ్మీముహూర్తాన గణగణ మోగిన ఫోను శబ్దానికి ఇంటావిడ లేవకముందే నేను లేచి బయల్దేరాను. బయటికొచ్చిన నన్నుచూసి చంద్రుడు నవ్వాడు. ఆ అరనవ్వే చెబుతో...
-
'ప్రయాణం టైమవుతోంది. బట్టలు సర్దుకోవాలబ్బాయ్!' తను నన్నిలా 'అబ్బాయ్' అని పిలిచిందంటే తన మూడ్ బావున్నట్టే! అదొక లిట్మస్ టెస్...
-
తొండ ముదిరితే ఊసరవెల్లవడం మనం చూసిందెప్పుడూ లేదుగానీ, ఎండ ముదిరితే రోహిణీకార్తవడం మాత్రం మనందరికీ తెలుసు. అనెస్తటిస్టునవ్వడం మూలాన నా జీవిత...
-
పెద్దాడికి ప్రేమతో... మొన్నేఁవైందో తెలుసా? మనూళ్ళో కొత్తగా బట్టలకొట్టొకటి పెట్టారు, అదేలే..షాపింగ్ మాల్! కొత్తగా మెరిసిపోతోందని, ఓమారు చూద్...